బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మూడవ వన్ డే లో ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను అంపైర్ ఎల్బి గా ఔట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఔట్ పై హర్మన్ సంతృప్తి గా లేకపోవడంతో… వెళ్తూ వికెట్లను తన బ్యాట్ తో కొట్టింది.. ఈ విషయం రెండు రోజులుగా బాగా వైరల్ అవుతోంది. కాగా తాజాగా ఈ విషయంపై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ మైదానంలో వ్యవహరించిన తీరు క్రికెట్ లో క్షమించరానిది అంటూ ఆమెపై చర్యలు తీసుకుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమెపై ఐసీసీ రెండు అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడకుండా నిషేధం విధించింది. ఆటలో అప్పుడప్పుడు అంపైరులు పొరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం కొత్త కాదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన ఆట నియమాలను ఉల్లంఘించడం కరెక్ట్ కాదు అంటూ రెండు వన్ డే అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఐసీసీ.
ఒక ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సీనియర్ క్రికెటర్లు అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. ఆట గెలవడానికి కొంతమంది ఆటగాళ్లను శిక్షించినా తప్పు లేదు అంటున్నారు.