ICC : వరల్డ్ కప్ లో టాప్ 10 ఫీల్డర్లు వీరే !

-

క్రికెట్ లో బ్యాటింగ్ , బౌలింగ్ తో పాటుగా ఫీల్డింగ్ కూడా చాలా కీలకం అని తెలిసిందే. ఒక్కోసారి కీలక ప్లేయర్ రన్ అవుట్ అయ్యి ఆ జట్టు ఓడిపోయినా సందర్భాలు అనేకం అని చెప్పాలి. అందుకే వన్ డే వరల్డ్ కప్ లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన టాప్ 10 ప్లేయర్ ల జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. అందులో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లాబుచెన్ ( AUS ) ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలలో వరుసగా వార్నర్ ( AUS ) , మిల్లర్ ( SA ), జడేజా ( IND ), సిబ్రాండ్ ( NED), కోహ్లీ ( IND ), మార్క్ రామ్ ( SA ), శాన్తంర్( NZ ), మాక్స్ వెల్ ( AUS ) మరియు ఫిలిప్స్ ( NZ ) లు ఉన్నారు.

ఆస్ట్రేలియా నుండి ఏకంగా ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకోగా, ఇండియా, సౌత్ ఆఫ్రికా , న్యూజిలాండ్ ల నుండి తలో రెండు ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. ఇక సంచలనాలకు మారుపేరుగా నిలిచిన నెదర్లాండ్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news