మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత..

గత రాత్రి విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఘటన రాష్ట్రమంతా తెలియడానికి ఉదయం బయటపడింది. వాస్తవ పరిస్థితులు తెలిసిన ప్రకారం ఈ ఘటనకు అంతా ముఖ్యకారణం యు ట్యూబర్ నాని అని తెలిసిపోయింది. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యు ట్యూబర్ నాని కొంతమందికి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశాడని పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఈ పార్టీలో మద్యం ఎక్కువకావడం వారిలో వారికే గొడవలు రావడంతో పెద్ద వివాదంగా మారిపోయి బొట్లు తగలబడేదాకా విషయం వచ్చింది. ఈ ఘటనలో 40 బొట్లు దగ్ధం అయిపోయాయి. కాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మొదటగా దిగ్భ్రాంతిని తెలియచేశారు. అనంతరం నష్టం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మత్స్యకారుల పట్ల తన ఉదారతను తెలియచేసే నిర్ణయాన్ని తీసుకున్నాడు.

తగలబడిపోయిన బోట్ లలో 80 శాతం వరకు పరిహారం చెల్లించడానికి ఆదేశాలను సంబంధిత అధికారులకు ఇచ్చాడు. వారి జీవితాలను నిలబెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు సీఎం జగన్.