రేవంత్ రెడ్డి హింస చెలరేగేలా మాట్లాడుతున్నారు.. ఈసీకి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింస చెలరేగేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమాభరత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం… సీఈవో వికాస్ రాజ్‌ను కలిసింది. కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాభరత్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సీఈవోకు నాలుగు ఫిర్యాదులు అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారన్నారు.

BRS, Congress Race to Win over Muslim, Minority Voters

ఇది ఇలా ఉంటె, అధికార బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల జారీకి అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించగా తెలంగాణ ప్రభుత్వం ఆశించిన రెస్పాన్స్ రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండింగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. రైతుబంధు ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీని ఆశ్రయించిందని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టతనిచ్చారు. రైతుబంధు ఆపాలంటూ తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.