ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో బయటపెడతా – భూమా అఖిలప్రియ

-

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చూపు టిడిపి వైపు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శిల్పా రవి టిడిపి నాయకులతో టచ్ లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఆధారాలతో సహా చర్చకు రావాలని సవాల్ విసిరారు.

రానిపక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. “ఈ నెల 4న ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా. నేను చేసిన అక్రమాలను శిల్పా రవి కూడా బయట పెట్టాలి. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకొని వస్తాను. నేను అక్రమాలకు పాల్పడ్డానని ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి” అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version