కరోనా వ్యాక్సిన్ పై వస్తున్న దుష్పప్రచారంపై ICMR కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచలేదని భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో తేలింది. వాస్తవానికి వ్యాక్సినేషన్ ఆకస్మిక మరణాల ఉప్పును తగ్గించినట్లు పేర్కొంది. గతంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందడం, అతిమధ్యపానం, స్వల్ప సమయంలో అధిక శారీరక శ్రమ వంటివి ఇందుకు కారణాలుగా అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం సమీక్ష దశలో ఉన్న ఈ వివరాలు బయటకు వచ్చాయి.
ఇక తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గతంలో కరోనా బారినపడి కోలుకున్న వారిని ఉద్దేశించి కీలకమైన సూచనలు చేశారు. ఎవరైతే కరోనా ను ఎదుర్కొని ప్రాణాలతో బయట పడ్డారో వారు 1 నుండి 2 సంవత్సరాలు ఒత్తిడితో కూడిన ఎటువంటి పనులు చేయడానికి వీలు లేదంటూ ఖరాఖండీగా చెప్పేశాడు మంత్రి మాండవీయ. రీసెంట్ గా మీరు చూసుకుంటే దేశంలో గుండెపోటు మరణాలు అధికంగా కనిపిస్తున్నాయి, వీటిపైన ICMR చేసిన ఒక అధ్యయనంలోని విషయాలను మాండవీయ ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశారు.