దెబ్బకొడితే కేసీఆర్‌కు దిమ్మ తిరిగింది : ఎంపీ ఈటల

-

గత బీఆర్ఎస్ సర్కార్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ పేదల కళ్లలో మట్టి కొడుతోందని, కేసీఆర్ కూడా ఇలాగే విర్రవీగి ఏమయ్యాడో అందరూ చూశారని ఈటల మండిపడ్డారు. గురువారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట గ్రామంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యమానికి హాజరైన ఆయన కాంగ్రెస్ సర్కారు తీరును తూర్పారబట్టారు.

రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న పాపానికి హైదరాబాద్‌‌లోని పేదలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఎంతమంది పేదల కళ్ళలో మట్టి కొడుతుందని, ఎంతమంది జీవితాలను బుగ్గిపాలు చేస్తుందని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదలపై చేస్తున్న దౌర్జన్యాలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదని, నీయబ్బ జాగీరా? అని అడుగుతున్నామని ఫైర్ అయ్యారు.కేసీఆర్ కూడా ఇలానే విర్రవీగాడని..చివరికి ఏమయ్యాడో ప్రజలు చూశారని, దెబ్బకొడితే దిమ్మ తిరిగిందని అన్నారు. పేదల బతుకుల్లో మట్టి కొడితే వారి ఉసురు తగలకుండా పోదని ఈటెల హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news