అది కాంగ్రెస్ కు సిట్టింగ్ స్తానం.. అక్కడ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాలని పార్టీ భావిస్తోంది.. అందులోనూ అధికారంలో ఉండటంతో వార్ వన్ సైడ్ అని భావిస్తున్నా.. బీఆర్ఎస్ అమలు పరుస్తున్న వ్యూహాలు.. బిజేపీ స్కెచ్ లతో కాంగ్రెస్ లో గుబులు మొదలైంది.. దీంతో త్వరగా అభ్యర్దిని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.. ఇంతకీ ఎంటా ఎన్నికలంటే.. ఉత్తర తెలంగాణాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్నారు..
తెలంగాణా రాజకీయాలు ఎన్నికల మూడ్ నుంచి బయటికి వచ్చేలా లేవ్.. గత ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు.. ఆపై మే నెలలో లోక్ సభ ఎన్నికలు.. ఇప్పుడు ఉత్తర తెలంగాణాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. మరికొద్దిరోజులు పోతే లోకల్ బాడీ ఎన్నికలు.. ఇలా ఎన్నికల హడావుడి ఇప్పడల్లా తగ్గలేలేదు.. అస్సలు విషయం ఏంటంటే.. కొద్దిరోజుల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిపికేషన్ రాబోతుంది.. దీంతో అన్ని పార్టీలు దానిమీద ఫోకస్ చేశాయి..
ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్ది వేటలో బిజిగా ఉంది.. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి.. దీంతో ఆ పార్టీ త్వరగా అభ్యర్దిని ప్రకటించి.. ప్రచారాన్ని షురూ చెయ్యాలని భావిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం.. ఆయా జిల్లాలో పట్టునిలుపుకుని.. ఎమ్మెల్సీని చేజిక్కించుకోవాలని భావిస్తోంది.. ఈ రెండు పోటాపోటీగా ఉంటే.. బీజేపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోంది.. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించేది కరీంనగర్ నుంచే. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లలో ఆ పార్టీ ఎంపీలే ఉన్నారు. దీంతో వారు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు..
తమ అభ్యర్దిత్వాన్ని పరిశీలించాంటూ మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు.. అధినేతలను కోరుతున్నారు.. టిక్కెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి.. మరో ఛాన్స్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారగా.. సీనియర్ నేతలు వెలిచాల రాజేందర్ రావు, మేనేని రోహితరావు, ప్రణవ్ బాబు, ఓ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. దీంతో అభ్యర్ది ఎంపిక పార్టీకి ఇబ్బందికరంగా మారిందని..నేతలు చర్చించుకుంటున్నారు..