కేసీఆర్ తప్పు చేయకపోతే… కమిషన్ ముందు నిరూపించుకో…టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

-

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం అని, చేసిన తప్పులకు శిక్ష పడుతుందేమో అని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ తెలిపారు.కేసీఆర్ కి భయం మొదలైంది. చేసిన తప్పులు బయటకు వస్తాయని.. 12 పేజీల లేఖ రాశావు.. అదే కమిషన్ ముందు వెళ్లి చెప్పుకోవచ్చు కదా అని అన్నారు.తప్పు చేయకపోతే… కమిషన్ ముందు నిరూపించుకో. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు బయటకు రావాలి అని అన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలి. కేసీఆర్ విచారణకు సహకరించాలి’ అని ఆయన కోరారు.

కాగా, పవర్ కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డి విచారణ తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టారు. ఇవాళ జస్టిస్ నర్సింహారెడ్డికి 12 పేజీల లేఖ రాశారు కేసీఆర్. స్వచ్ఛందంగా మీరే విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ,నర్సింహారెడ్డి తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పులిచ్చినట్టుగా ఉందని మండిపడ్డారు.రాజకీయ కక్షతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news