తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఇన్‌ఛార్జి వీసీల పదవీకాలన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్‌ఛార్జి వీసీలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల రాష్ట్రంలోని 10 వర్సిటీలకు ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జి వీసీలుగా నియమిస్తూ ,జూన్ 15 వరకు ఇన్‌ఛార్జి వీసీలు కొనసాగుతారని మే 21న విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి వీసీల నియామకం జరగకపోవడంతో ఇన్‌ఛార్జిల పదవీకాలం పొడిగించింది.
ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్,కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ, జేఎన్‌టీయూ బాధ్యతలను బుర్ర వెంకటేశ్‌కు ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా,అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి, తెలుగు యూనివర్సిటీకి వీసిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు. అలాగే శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్,జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌కి జయేశ్ రంజన్,మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, పాలమూరు వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా నదీం అహ్మద్‌ను నియమించింది.