కరోనా మహమ్మారితో ప్రస్తుతం అంతటా లాక్ డౌన్ లో ఉన్నారు. అన్ని పరిశ్రమలతో పాటు సౌత్ నార్త్ సినిమా ఇండస్ట్రీలు లాక్ డౌన్ కి సహకరిస్తున్నాయి. షూటింగ్స్ లో ఉన్న సినిమాలన్నీ అర్ధాంతరంగా ఆపేశారు. ఇక ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న కొన్ని సినిమాలకి వర్క్ ఫ్రం హోం గా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుతున్నారు. అయితే అన్ని కార్యల్రమాలు కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడి అయిన సినిమాలు మాత్రం జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్ డౌన్ తో ఆగిపోయాయి.
ఈ నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ సడలించవచ్చన్న అభిప్రాయాన్ని ఇటీవల ప్రధాని తో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వెల్లడించారు. ప్రస్తుతానికైతే ఇదే మాట వినిపిస్తుంది. దాంతో గత నెల, ఈ నెల రిలీజ్ కావాల్సిన సినిమాలని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మే 3 న లాక్ డౌన్ ఎత్తేస్తే గనక రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాల లిస్ట్ ఇదే అని తాజా సమాచారం. ముందుగా నేచురల్ స్టార్ నాని సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారు. వాస్తవంగా ఈ సినిమాని మార్చ్ నుండి ఏప్రిల్ కి మార్చారు. ఇప్పుడు ఆ డేట్ కూడా పోస్ట్ పోన్ చేసి జూలై లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరీ నటించారు.
ఇక ఇదే నెలలో ఒకటి లేదా రెండు వారాల గ్యాప్ ఇచ్చి రాం నటించిన రెడ్ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నేను శైలజ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాని స్రవంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాతో పాటు మాస్ మహా రవితేజ నటించిన క్రాక్ సినిమాని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని ఆగస్టు లో, వెంకటేష్ నారప్ప సినిమాని సెప్టంబర్ లో బాలకృష్ణ, బోయపాటి ల సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఈ సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. ఒకవేళ లాక్ డౌన్ గనక ఇంకా పొడగిస్తే మాత్రం మళ్ళీ అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశాలున్నాయట.