అవును! ఈ విషయం సడెన్‌గా తెరమీదికి వచ్చింది కాదు. దాదాపు మూడు నెలలుగా టీడీపీలో జరుగుతున్న చర్చ. అయితే, ఇప్పుడు చూచాయగా మీడియాకు లీకులు ఇచ్చారని అంటున్నారు. వచ్చే రెండేళ్లలో అంటే.. ఎన్నికలు జరిగేందుకు మరో రెండేళ్లు ఉందనగా రాష్ట్రంలో అధికారం మారిపోయే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. మరో రెండేళ్లలో జగన్ పాలన అంతం అవుతుందని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇదేదో.. రాజకీయంగా చేసిన విమర్శేనని అందరూ అనుకున్నారు. కానీ, అసలు విషయం నెమ్మదిగా ఇప్పుడిప్పుడే తెరమీదికి వస్తోంది.
విషయం… ఏంటంటే.. ఏపీలో బీజేపీ ఎదగాలనేది కేంద్రంలోని బీజేపీ ప్లాన్. అదే సమయంలో ఏపీలో తన హవాను మరింత పెంచుకోవాలనేది, అధికారంలోకి మళ్లీ రావాలని చంద్రబాబు ఉద్దేశం. ఇక, ఈ రెండు పార్టీలను సమర్ధించే కమ్మ సామాజిక వర్గం.. కూడా జగన్ పాలనతో తమకు ఎలాంటి లాభం లేదని, పైగా రాజధాని తరలింపు వంటి కీలకమైన విషయం కనుక ముందుకు సాగితే.. తమ పరిస్థితి దారుణంగా తయారవుతుందని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎంత వెనక్కి లాగే ప్రయత్నం చేసినా జగన్ వెనక్కితగ్గని పరిస్థితి నెలకొంది. ఇక, టీడీపీ వంటి కీలక పార్టీలు ఎదిగేందుకు కూడా జగన్ అడ్డుపడుతున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న బీజేపీ, టీడీపీలలోని కమ్మ వర్గం..వ్యూహాత్మకంగా చక్రం తిప్పేందుకు పావులు కదుపుతోందని అంటున్నారు పరిశీలకులు. అంటే.. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలోనే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసేలా పావులు కదపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రాతిపదికగా.. జగన్‌ను కేసుల రూపంలో నిలువరించడం, లేదా వైఎస్సార్ సీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా పనికానివ్వాలనేది పెద్ద వ్యూహంగా ఉందని అంటున్నారు.
అయితే, ఈపని ఇప్పుడు ఎవరు చేయాలి? బీజేపీ చేస్తుందా? లేక.. చంద్రబాబు చేస్తారా? అనేదానిని బట్టి అధికారం పంచుకోవడం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో మాదిరిగా.. జగన్ ప్రభుత్వాన్ని చీల్చేందుకు ఉన్న అవకాశాలను గమనిస్తున్నారు. మరి ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఏదేమైనా.. జగన్‌కు వచ్చే రెండేళ్లపాటు ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. అయితే తిరుగులేని బలంతో ఉన్న జగన్ వీటికి ఎలా చెక్ పెట్టకుండా ఉంటారా ?