ఆసియా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి మరియు మన దాయాధి దేశం అయిన పాకిస్తాన్ పై ఇండియా ఘనవిజయం సాధించి కప్ ను సొంతం చేసుకుంది. గత శనివారం జరిగిన సెమీఫైనల్ లో ఇండియా మలేషియా పై 10 – 4 గోల్స్ తేడాతో గెలిచి సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. ఇక పాకిస్తాన్ సైతం సెమీఫైనల్ లో ఒమన్ ను 7 – 3 గోల్స్ తేడాతో ఓడించి ఇండియాతో ఆఖరి సమరానికి సిద్ధమైంది. కాసేపటి క్రితమే ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరిగిన ఫైనల్ మ్యాచ్ పూర్తి కాగా, ఇందులో ఇండియా పెనాల్టీ షూట్ అవుట్ లో ఆధిక్యాన్ని కనబరిచి పాకిస్తాన్ ను ఓడించింది. ముందుగా నిర్ణీత సమయం పూర్తి అయ్యే లోపు రెండు జట్లు కూడా 4 – 4 గోల్స్ తో సమానంగా ఉన్నాయి. ఇక ఫలితం తేలడానికి అంపైర్ లు పెనాల్టీ షూట్ అవుట్ ను నిర్వహించారు.
ఈ షూట్ లో ఇండియా 2 గోల్స్ ను కొట్టి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆసియన్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నమెంట్ విజేతగా ఇండియా నిలిచింది.