శివుడికి ఇలా అభిషేకం చేస్తే.. కష్టాలే ఉండవు..!

-

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం మనం అనుకున్నవి శివుడు పూర్తి చేయాలంటే కచ్చితంగా శివుడుని ఇలా అభిషేకం చేయాలి అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా కనుక మీరు పరమశివుడిని కొలిచారంటే ఇక మీకు తిరిగే ఉండదు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కచ్చితంగా వీటిని ఆచరించండి ఇక అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కలగవు. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఆనందంగా జీవించొచ్చు.

శివుడికి అభిషేకం చేసేటప్పుడు వీటితో అభిషేకం చేస్తే పరమశివుడికి ఆనందం కలిగి మీ కోరికల్ని తీరుస్తారు. శివుడు ని నీటితో కానీ పాలతో కానీ అభిషేకించొచ్చు ఏ ద్రవంతో అభిషేకం చేసిన మంచి ఫలితం కనబడుతుంది. నష్టపోయిన వాటిని తిరిగి పొందాలంటే శివుడిని గరిక నీళ్లతో అభిషేకం చేయండి అప్పుడు నష్టపోయినవి పొందొచ్చు. పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి.

నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేయొచ్చు అప్పుడు అపమృత్యువు నశిస్తుంది ధనం బాగా పెరగాలంటే చెరుకు రసంతో శివుడిని అభిషేకించండి. ఆవు నెయ్యి తో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి మీకు కలుగుతుంది భోగభాగ్యాలు కలగాలంటే బిల్వజలముతో అభిషేకం చేయండి. తేజో వృద్ధి కోసం తేనెతో అభిషేకం చేయండి భూ లాభం కోసం పుష్పోదకముతో అభిషేకం చేయండి సకల సంపత్తులు కలగాలంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి ఇలా ఈ విధంగా మీరు శివుడిని అభిషేకం చేయడం వలన బాధలన్నీ పోయి ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news