పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మొదటిసారి నటించిన చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్ గా వచ్చింది. ఇక తమిళ్ లో చేసిన సముద్రఖని ఈ సినిమాను రీమేక్ చేస్తూ డైరెక్ట్ చేసారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమిక్స్ సినిమాలకు త్రివిక్రమ్ అన్ని పనులను దగ్గరుండి మరి చూసుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే.. పవన్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా గత నెల 28న రిలీజ్ అయింది. అయితే..గత నెల 28న రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 25 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అంటే సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది.. కానీ ఈ నెల 25 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.