వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే లోక్ సభను ఆదివారాలు నడిపిస్తామి స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. నష్టపోయిన సమయం మేరకు ఇలా నిర్వహిస్తామని తెలిపారు. అదానీ అంశం పై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో క్రితం వారం సభ సాగలేదు. దీంతో ఉభయ సభల్లోనూ రెండు రోజులు రాజ్యాంగం పై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 14న 11 AM కి సభ ప్రారంభం అవుతుంది. మళ్లీ వాయిదాలు పడితే ఆదివారాలు రావాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా యూపీలోని సంభల్ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో గత వారం సభ కార్యకలాపాలు స్తంబించాయి. కొలిక్కి వచ్చినట్టే కనిపించింది. ఇవాళ ఉభయ సభలు సజావుగానే ప్రారంభమయ్యాయి. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా.. కాంగ్రెస్, విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం పై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసాయి.