ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఇవాళ భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి డిసెంబర్ 04న భేటీ అవుతుందని తొలుత ప్రకటించారు. కానీ మళ్లీ డిసెంబర్ 03కి వాయిదా వేశారు. ఇవాళ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలు పెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 

పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక, స్పోర్ట్స్ పాలసీ 2024-29, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 

Read more RELATED
Recommended to you

Latest news