పురుషుల ఛాతిపై వెంట్రుకలు ఉంటే దేనికి సంకేతం..ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

-

కొందరి పురుషుల ఛాతిపై దట్టంగా వెంట్రుకలు ఉంటాయి. అవి మగతనానికి గుర్తుగా ఒకప్పుడూ చెప్పుకునే వాళ్లు.. కానీ ఈ మోడ్రన్ యగంలో అబ్బాయిలు కూడా అలా ఛాతీపై వెంట్రుకలను పెంచుకోవటానికి ఇష్టపడటం లేదు. అయితే ఎవరికైతే వెంట్రుకలు అలా పెరుగుతాయో దాని వెనుక కొన్ని కారణాలు ఉంటాయట. అవి సంకేతాలుగా కూడా చెప్పుకోవచ్చు. చాలామంది అనుకుంటారు..హార్మోన్స్ వల్ల అలా పెరుగుతుంటాయి అని..కానీ దాని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.

శరీరంలో ఉన్న ప్రతిఅణువుకు ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది. అలాగే పురుషుని ఛాతిపై పెరిగే వెంట్రుకలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది.
పురుషుల ఛాతీ పెరిగే వెంట్రుకలు ఆ వ్యక్తి అదృష్టాన్ని, స్వభావాన్ని సూచిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఈ నేపధ్యంలో పురుషుల శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయి. అబ్బాయిలకు సాధారణంగా 14-15 ఏళ్ల వయసులో ముఖంపై వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. పురుషుల శరీరంలో హార్మోన్స్ విడుదల కారణంగా శరీరంపై వెంట్రుకలు మొలుస్తాయి.

వారసత్వం ప్రకారం వస్తాయా

అయితే ఇలా పెరగటం ఇది ఆ వ్యక్తి డీఎన్ఏపై ఆధారపడివుంటుంది. కుటుంబంలోని తాత, ముత్తాతలకు శరీరంపై వెంట్రుకలు దట్టంగా పెరిగితే.. వారి సంతానంలోని పురుషులకు కూడా ఇదే లక్షణం వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంపై వెంట్రుకల పెరుగుదల అనేది అని టెస్టోస్టెరాన్‌పై ఆధారపడుతుంది. ఈ టెస్టోస్టెరాన్‌లో ఆండ్రోజెన్ మోతాదు మనిషి శరీరంలో అధికంగా ఉంటే.. ఛాతీపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి.

జ్యోతిష్యం శాస్త్రం ఏం చెబుతోంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…ఛాతిపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటే అతను మిగిలిన పురుషుల కన్నా అదృష్టవంతుడు. శరీరంపై అత్యధికంగా వెంట్రుకలు ఉన్న పురుషులు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇటువంటి పురుషులు ఇతరులను ఆదరించడంలోనూ, నిజాన్ని మాట్లాడటంలోనూ ముందుంటారట. జీవితంలోని చాలా విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఛాతీపై అత్యధికంగా వెంట్రుకలు ఉండే పురుషులు ఎంతో కష్టపడి పనిచేసేవారట. అందరి నమ్మకాన్ని సంపాదించుకుంటారు. మోసం చేసేందుకు ఇలాంటి వ్యక్తులు వెనుకాడతారు. మంచి నాయకత్వ లక్షణాలను కలిగివుంటారట. అందరితో కలసిపోయి ముందుకుసాగే ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది.

చాలామంది అమ్మాయిలకు ఇలా వెంట్రుకలు ఉండే అబ్బాయిలంటే ఇష్టం ఉంటుంది. చూడ్డానికి కూడా రొమాంటిక్ గా కనిపిస్తారు. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇలా వెంట్రుకలు ఉంటే వెంటనే ఈ ఆర్టికల్ షేర్ చేసి చెప్పండి.

Read more RELATED
Recommended to you

Latest news