అక్రమ హోర్డింగ్ లపై జిహెచ్ఎంసి ఉక్కుపాదం మోపింది. పలు షో రూమ్ ల మీద ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గత 10 రోజులుగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ప్రముఖ షో రూమ్ లకు ఇప్పటికే అధికారులు జరిమానాలు కూడా విధించారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతుంది. వారం రోజులు వ్యవధిలో పలు వ్యాపార సముదాయాలకు 70 లక్షలు పైగా పెనాల్టీలు వేసారు.
కూకట్పల్లి ఫోరమ్ సుజనా మాల్ కు మొత్తం 12లక్షల 50 వేల జరిమానా విధించారు. అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు , బ్యానర్లు పై భారిగా జరిమానా లు వేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు… అక్రమ హోల్డింగ్ లు ఉంటే మాత్రం క్షమించేది లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఎవరు అయినా సరే అనుమతి ఉన్న ప్రాంతంలోనే హోర్డింగ్ పెట్టుకోవాలి అని స్పష్టం చేస్తున్నారు.