చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో ఎటువంటి సమస్యనైనా కూడా సులభంగా దాటేయొచ్చు. లైఫ్ లో ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ప్రతి సమస్యకు కూడా చాణక్య సూత్రాలతో మనకి పరిష్కారం దొరుకుతుంది. అయితే మన లైఫ్ బాగుండాలి అంటే కచ్చితంగా ఈ విషయాలు బాగుండాలని చాణక్య అన్నారు. సమయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది ప్రతి ఒక్కరు సమయం మీద ఆధారపడి ఉంటారు.
సమయం ఒకసారి దాటితే మళ్ళీ తిరిగి రాదు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఖచ్చితంగా మనం లైఫ్ లో సక్సెస్ అవుతాము. సరిగ్గా సమయాన్ని వినియోగించుకోకపోతే కచ్చితంగా లైఫ్ వృధా అవుతుంది. కచ్చితంగా డబ్బును ప్రతి ఒక్కరు ఆదా చేసుకోవాలి డబ్బు ఆదా చేస్తేనే జీవితంలో విజయం అందుకుంటారు. డబ్బుతో క్రమశిక్షణతో మెలగాలి డబ్బులు సరిగ్గా ఎలా ఖర్చు చేయాలనేది తెలుసుకోవాలి. అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలి.
డబ్బుని సరిగ్గా ఖర్చు చేస్తేనే లైఫ్ లో మీరు కూడా ఆనందంగా ఉంటారు. విద్యా జ్ఞానం ఎప్పుడూ కూడా పోవు. విద్యా జ్ఞానం ఎప్పుడు అలానే ఉంటాయి దానిని మన నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. విద్యా జ్ఞానం ఉంటే కచ్చితంగా లైఫ్ బాగుంటుంది. అదేవిధంగా స్వార్థం అస్సలు పనికిరాదు స్వార్థం వుండకూడదు. స్వార్ధం విడిచిపెట్టి నలుగురికి ఉపయోగకరంగా ఉంటేనే మన మనము ఆనందంగా ఉంటాము. ఎప్పుడు కూడా ఈ ఐదు విషయాలని గుర్తు పెట్టుకొని మనం ఆచరించాలి వీటిని ఆచరిస్తే మన జీవితం సంతోషంగా ఉంటుంది.