గత నెలలో ఒడిశా లోని బాలేశ్వర్ లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా జలదరిస్తుంది. ఇప్పటికీ కూడా ఆ రైలు ప్రమాదంలో 291 మంది మరణించారు, ఆ మరణించిన కుటుంబాల ఆర్తనాదాలు చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఘటన ప్రపంచంలోని అతి పెద్ద రైలు ప్రమాదంగా గుర్తించారు. కాగా తాజాగా ఓడిశాలోని బాలేశ్వర్ వద్ద మరో ఘటన జరగాల్సింది. కానీ అదృష్టం బాగుండి కొంతలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. బాలేశ్వర్ వద్ద రైలు ట్రాక్ లను బాగు చేస్తుండగా, అటుగా వస్తున్న రైలుకు సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాంగ్ గా సిగ్నల్ ఇవ్వడంతో మరమ్మతులు చేస్తున్న ట్రాక్ పైకి రైలు దూసుకుపోయింది. అయితే వెంటనే ఇది గమనించిన లోకో పైలట్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది.
ఒకవేళ లోకో ఫైలట్ కనుక గమనించకుండా ఉంటే ఈ రోజు మరో రైలు ప్రమాదం జరిగేది. ఎందుకు ఒడిశా రాష్ట్రంలో రైల్వే డిపార్ట్మెంట్ ఇలా పనిచేస్తోందని అందరూ విమర్శిస్తున్నారు.