నిద్రపోతున్నప్పుడు మనిషికి కలలు రావడం సహజం. కలలు మనకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలను స్వప్న శాస్త్రం చెప్తుంది. చాలా మందికి నిద్రలో ఏవేవో కలలు వస్తాయి. కొన్నిసార్లు వీటి వల్ల భయమేసి మేల్కుంటారు. ఇదంతా కల అయితే బాగుండు అని కలలోనే అనుకుంటారు. అంత టెన్షన్ పెడతాయి కలలు. అయితే బ్రహ్మముహుర్తంలో వచ్చే కలల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు ఇలాంటి కలలు తెల్లవారుజామున వస్తే అదృష్టం మీ వెంటేనట.! అవేంటంటే..
తెల్ల వారజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో వచ్చే కలలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. కలలో ఒక చిన్న పిల్లవాడు నవ్వడం, సరదాగా ఉండటం కనిపిస్తే సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించడానికి స్పష్టమైన సంకేతమట.
కలలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేయడాన్ని మీరు చూస్తే, అది జీవితంలో బంగారు రోజుల ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. అంటే మీరు డబ్బు, సంపద, పదవి, గౌరవం అన్నీ పొందబోతున్నారు.
కలలో కలశాన్ని అంటే నీళ్లతో నిండిన కాడ లేదా మరేదైనా పెద్ద పాత్రను చూస్తే ఖచ్చితంగా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని అర్థం. దానిపై మట్టి కుండ లేదా పాత్ర కనిపిస్తే ఇంకా మంచిది. అలాంటి వ్యక్తి త్వరలో అపారమైన సంపదను పొందడంతో పాటు ఆస్తిని పొందుతాడట.
ఒక వ్యక్తి కలలో ధాన్యాల కుప్పను ఎక్కడం చూసినట్లయితే, ఈ కల చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాంటి వ్యక్తికి త్వరలో డబ్బు వస్తుంది.
మీరు లేదా ఇతరులు కలలో స్నానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం. అలాంటి కల వచ్చినట్లయితే, ఆ వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. ఆ క్రమంలో అతడు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
కలలో పళ్లు విరగడం కూడా చాలా శ్రేయస్కరమట.. ధనలాభంతో పాటు ఉద్యోగ-వ్యాపారంలో పురోగతికి సంకేతం.
కలలో మీ జుట్టు కత్తిరించుకోవడం మీ ఆర్థిక సమస్యలు ముగియబోతున్నాయని, మీరు అప్పుల భారంతో ఉంటే, మీరు కూడా దాని నుండి బయటపడతారని చెబుతుంది.
ఇవి కనిపించినా శుభప్రదమే..
కలలో దేవాలయం, శంఖం, పాలు, బియ్యం, శివలింగం, దీపం, గంట, తెల్ల ఏనుగు, రాజు, రథం, పల్లకి, ప్రకాశవంతమైన ఆకాశం, పౌర్ణమి కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదం. సదరు వ్యక్తికి పెద్ద విజయం, అపారమైన సంపద, గౌరవం లభిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతుంది.