ఈ తప్పులు ఇంట్లో జరగకుండా ఉంటే డబ్బుకి లోటు ఉండదు…!

-

మీరు మీ ఇంట్లో అనుసరించే పద్ధతిని బట్టి ఇంట్లో ఫలితం అనేది ఉంటుంది. అయితే ఇంట్లో మంచి పద్ధతులు పాటిస్తే ధనలక్ష్మి కూడా తాండవం చేస్తుంది. అయితే ఈ పద్ధతులని కనుక మీరు అనుసరించారు అంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలా మంది తెలియక ఇంట్లో అనేక తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులు చేయడం వల్ల ఆర్ధిక నష్టం మొదలైన సమస్యలు కలుగుతాయి. అయితే ఇంట్లో ఆచరించాల్సిన పద్ధతులు ఏమిటి…?, ఎటువంటి పద్ధతులు ఆచరించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం

సూర్యోదయం అవ్వకుండానే స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పొద్దు ఎక్కక ముందే లేచి ఇల్లు శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉండకుండా ఉంటుంది. లేదంటే దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది.
అలానే ఆడవాళ్ళు ఎప్పుడూ దిండుపై కూర్చోకూడదు. ఆడవారే కాదు ఇంకా ఎవరు కూడా దిండు మీద కూర్చోకూడదు.
ఇంట్లో తలపెట్టిన మంచి పనులు ఏమైనా శుక్లపక్షం లోనే చేయాలి బహుళ పక్షంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. పండితులు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు.
అలానే కొత్తబట్టలు ధరించేటప్పుడు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. పసుపు క్రిమినాశక కాబట్టి సమస్యలేమీ రాకుండా ఉంటాయి.
ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యం వంటి వాటిని ఎవరికీ చేతికి ఇవ్వకూడదు. వాటిని కింద పెట్టి తీసుకోమనాలి.
ఆడవాళ్ళూ ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని తిరగకూడదు. అలా చేస్తే చేదు ఫలితాలు వస్తాయి.
సుమంగళి స్త్రీలు రాత్రివేళల్లో అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు.
ఇంట్లో ఎప్పుడైనా శ్రాద్ధము ఉంటే అది ముగిసే వరకు కూడా ముగ్గు వేయకూడదు. అది అయిపోయిన తర్వాత మాత్రమే ముగ్గు వేయాలి.
ఉదయం నిద్ర లేచిన వెంటనే నుదుటిన బొట్టు ఉండేలా చూసుకోవాలి.
మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను నిద్రలేచిన తర్వాత వెంటనే చూడడం మంచిది.
మంగళవారం మగవాళ్ళు గడ్డం గీసుకోకూడదు ఇలా చేస్తే దరిద్రం వస్తుంది. కనుక ఈ తప్పులు ఇంట్లో జరగకుండా చూసుకోవాలి లేదు అంటే ధనలక్ష్మి మీ ఇంట్లో ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version