ఇలా చేస్తే అత్తాకోడళ్ళ మధ్య గొడవలు రావు..!

-

సాధారణంగా ఏ ఇంట్లో అయినా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. ఎంత చక్కగా ఉండాలి అనుకున్నా ఏదో ఒక సమస్య రావడం ఖచ్చితం. అయితే మరి అత్తా కోడళ్ళ మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి అత్త కూడా ముందు ఇంట్లో కొత్త కోడలికి స్పేస్ ఇవ్వాలి. కేవలం కొడుకు గదిలో మాత్రమే కాకుండా ఇల్లంతా కూడా ఆమెకు కొంత స్పేస్ ప్రొవైడ్ చేయాలి.

 

ఆమెకి కనుక మీరు ఆమె తెచ్చుకున్న గ్యాడ్జెట్స్ మొదలైనవాటికి స్పేస్ ఇవ్వండి. అదే విధంగా ఆమె మీ ఇంట్లో ఎడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని ఆమెని మీరు ప్రెస్ చెయ్యద్దు. అలానే ఎప్పటిలాగా మీ కొడుకు గదిలోకి మీకు నచ్చినట్లుగా వెళ్లడం మానేయండి. ఒకవేళ తలపు జార వేసి ఉన్నా సరే లోపలికి అడగకుండా వెళ్ళకండి. రావచ్చ అని అడిగి అప్పుడు వెళ్ళండి.

అలాగే కొత్త కోడలు ఇంటికి వచ్చిన తర్వాత మీ పద్ధతులు ఏమిటో ఆమె పద్ధతులు ఏమిటో నెమ్మది నెమ్మదిగా తెలుసుకోవాలి అంతేగాని ఎప్పుడు విమర్శిస్తూ ఉండద్దు. ఆమె ఇంటికి వచ్చిన చుట్టం కాదు ఇంటి సభ్యురాలు అంటే ఇంటి పనుల్లో ఆమె కూడా భాగం పంచుకోవాలి. ఒకవేళ మీ కోడలు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆమె టైమింగ్స్ ని బట్టి ఏ పనులు చేస్తుందో చూసుకోండి. అలానే ఒకవేళ ఆమె జాబ్ చేస్తున్నట్లయితే మీరు ఆమెని కొన్ని పనులు చేయడం ఎక్స్పెక్ట్ చేయొద్దు.

కోడలు తో చక్కటి అనుబంధం ఏర్పరచుకోవాలి. మీ కోడలికి ఇబ్బంది అయితే మీ కొడుక్కి కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అత్తలు ఈ విధంగా నడుచుకుంటే మంచిది. ఇక కోడలు విషయానికి వస్తే కోడలు అత్త గారు చెప్పినట్లు వినాలి. వాళ్ళ పద్ధతిని కూడా తెలుసుకోవాలి. అలానే వాళ్లను గౌరవించాలి. ఆమె టైమింగ్ ని బట్టి ఇంటి పనుల్లో భాగం అవ్వాలి అంతే కానీ అంత అత్తగారు చేసుకుంటారు కదా అని వదిలేయకూడదు. వాళ్ళని ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. కాబట్టి ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే సమస్య ఉండదు. లేదంటే అనవసరంగా వాళ్ళ మధ్య గొడవలు వస్తుంటాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version