అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ పదం తొలగిస్తాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయండ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్  ప్రభుత్వం కూడా ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల వివక్ష, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై శనివారం హైదరాబాద్ గోల్కొండ హోటల్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతున్నది. అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు తెలంగాణ బీజేపీ పక్షాన శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి సానుకూల వాతవరణం ఉంది. రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం బీసీ పదాన్ని తొలగిస్తామని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news