పెట్రోల్, డీజిల్ కొంటే క్యాష్ బ్యాక్ ఇస్త‌రంట‌.. ఎలాగో తెలుసుకోండి…!

-

సామాన్య, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి ధరలు. నిత్యావసరాలు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలా ఒక్కదాని వెనుక మరొక వస్తువులు ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు సెంచరీ కొట్టగా, సామాన్యుడికి అది తడిసి మోపెడవుతుంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ వినూత్న ప్రయత్నం చేస్తోంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) తో కలిసి పెట్రోల్, డీజిల్ ట్రాంజాక్షన్స్‌పై క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు గాను కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సరికొత్త ఫీచర్లతో ఆవిష్కరించింది. తద్వారా కస్టమర్లకు ఎవ్రీ ట్రాంజాక్షన్‌ను బట్టి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలాగంటే..

ఈ కార్డు తీసుకున్న తర్వాత వెహికల్స్‌లో డీజిల్, పెట్రోల్ పోసుకునే సమయంలో ఉపయోగించాలి. ప్రతీ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్‌ వచ్చే అవకాశముంటుంది. కొనుగోళ్ల నుంచి వచ్చిన మనీని కస్టమర్స్ రీచార్జ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఈ కార్డును బిగ్ బజార్, ఈ కామర్స్ పోర్టల్స్‌ ఇతర స్టోర్స్‌లోనూ యూజ్ చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా గిఫ్ట్స్‌తో పాటు పలు ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..పాయింట్స్ వైజ్‌గా కార్డు‌లోకి మనీ వస్తుంటాయి. అయితే, అవి డైరెక్ట్ మనీ రూపంలో కాకుండా పాయింట్స్ రూపంలో యాడ్ అవుతుంటాయి.

ఐసీఐసీఐ, హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు ద్వారా హెచ్‌పీ పెట్రోల్ బంకుల్లో ఉపయోగించొచ్చు. రిటైల్ అవుట్‌లెట్లలో సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం నగదు తిరిగి వెనక్కు పొందొచ్చు. ఇందులో 4 శాతం క్యాష్ బ్యాక్ కాగా, 1 శాతం సర్ చార్జ్ మినహాయింపు ఉంటుంది. ఇది డైరెక్ట్‌గా కార్డులో యాడ్ అవుతుంది. ‘హెచ్‌పీ పే’ ఆధారంగా లావాదేవీలు ఈజీగా చేయొచ్చు. పే బ్యాక్ రివార్డ్ పాయింట్లూ అదనంగా వస్తాయి. క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు జాయినింగ్ బెనిఫిట్ కింద రెండు వేల పాయింట్స్ యాడ్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version