చేదుగా ఉంటుందని చాలా మంది కాకరకాయని తీసుకోరు. కానీ నిజానికి కాకరకాయ వలన అనేక లాభాలని పొందడానికి అవుతుంది. కాకరకాయని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చు. కానీ కాకరకాయ కేవలం చేదుగా ఉంటుందని చాలా మంది దూరం పెడుతుంటారు. కాకరకాయలో ఎన్నో చక్కటి గుణాలు ఉన్నాయి. కాకరకాయను తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
క్యాన్సర్ తో పోరాడే వ్యతిరేక గుణాలు కాకరలో ఉన్నాయి. కాకరకాయని మీరు చేదు లేకుండా చేదును తొలగించి వండుకున్నట్లయితే ఎవరైనా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా తినేస్తారు. మీరు కాకరకాయని వండుకునే ముందు తొక్కని సన్నగా తీసేస్తూ ఉండండి ఆ తర్వాత వండండి. ఇలా చేయడం వలన చేదు బాగా తగ్గుతుంది.
కాకరకాయ లోపల గింజలు పూర్తిగా తీసేసి వండుకుంటే కూడా కాకరకాయలో చేదు ఉండదు. కాకరకాయలని ముక్కలు కింద కోసి ఉప్పు పసుపు వేసి బాగా కడిగితే కూడా చేదు బాగా తగ్గుతుంది. వండుకునే ముందు కాకరకాయని ఉప్పు కలిపిన నీటిలో ఉడికించి ఆ నీటిని పిండేసి అప్పుడు వండుకుంటే కూడా చేదు తగ్గుతుంది. మజ్జిగలో వేసి పిండి కూర చేస్తే కూడా చేదు తగ్గుతుంది. బాగా డీప్ ఫ్రై చేస్తే కూడా చేదు బాగా తగ్గుతుంది. బెల్లం వేసి కూడా వండుకోవచ్చు అలా కూడా చేదు తెలియదు.