పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడంపై రఘురామ సెటైర్లు

-

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడంపై రఘురామకృష్ణ రాజు సెటైర్లు వేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ అధినేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడినట్లు సాక్షి దినపత్రికలో రాయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. తెలంగాణలో అసలు మన పార్టీ ఉందా?, 2018 లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేసిందా?? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అధికార బీఆర్ఎస్ పార్టీలోకి పంపింది జగన్ మోహన్ రెడ్డి గారు కాదా? అని నిలదీశారు. అయినా కాంట్రాక్టర్లు జగన్ మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం ఏముంది?, కమీషన్ల కోసం కాకపోతే అంటూ ప్రశ్నించారు. సైకో పోవాలని జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడంపై రఘురామకృష్ణ రాజు గారు స్పందిస్తూ… చట్ట ప్రకారం మానసిక స్థితి బాగాలేదని రుజువు అయితే అతన్ని పదవిలో నుంచి తొలగించవచ్చునని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేదని రుజువు చేయాలని, అంతేకానీ తమ నాయకున్నీ సైకో అనడం సరికాదని అన్నారు. బటన్ నొక్కడం ద్వారానే పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ మంచి సలహా ఇచ్చిందని తెలిపారు. బ్యాంకు అకౌంట్లు లేని వారికి, పోస్ట్ ఆఫీస్ లలో అకౌంట్లు తెరిచి వారి ఖాతాలలో డబ్బు జమ చేయాలని సూచించిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news