కరోనా మహమ్మారి తగ్గినా తరవాత మరో సారి అన్ని రైళ్లని మొదలు పెట్టారు. కోవిడ్ సంబంధిత ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయడంతో, రైళ్లలో ప్రయాణాలు కూడా పెరిగాయి. అయితే చాలా మంది చివరి నిమిషాల్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు, తత్కాల్ ఫీచర్‌ను వాడుకోనున్నారు. కానీ అది దొరకడం అంత ఈజీ కాదు. ఒకే సమయంలో ఎంతో మంది ప్రజలు తత్కాల్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
త్వరగా బుక్ చేస్తేనే అవుతుంది. ఏసీ కోచ్‌లకు తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. నాన్-ఏసీ కోచ్‌లకు ఉదయం 11 గంటలకు బుకింగ్స్ మొదలవుతాయి. అయితే ఐఆర్‌సీటీసీలో టిక్కెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు, ఫామ్‌లలో అన్ని వివరాలు నింపడం, క్యాప్చాను నమోదు చేయడం కోసం సమయం ఎక్కువ పడుతుంది.
అయితే ఇవన్నీ ఫిల్ చేస్తూ మీరు ఉంటే టిక్కెట్లన్ని అమ్ముడుపోయి, వెయిటింగ్ లిస్టులో పడిపోతారు. అయితే ఈ సమయం తగ్గించాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తీసుకొచ్చిన ఒక ప్రత్యేక ఫీచర్ గురించి చూడాలి. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు తమతో ప్రయాణించే వారి వివరాలను ముందే సేవ్ చేసుకుని ఉంచచ్చు. ఐఆర్‌సీటీసీలోకి లాగిన్ అయి, మీ వివరాలు, మీతో ప్రయాణించే మీ కుటుంబ సభ్యుల వివరాలు సేవ్ చేసుకోవచ్చు.
ఇలా చేయడం వలన త్వరగా టికెట్ ని మనం బుక్ చేసుకోచ్చు. తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై లాగిన్ అయి, కొత్త వివరాలను నమోదు చేసే దానిపై కాకుండా నేరుగా click add existingను క్లిక్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా యాడ్ అవుతాయి. ఆ తర్వాత అడ్రస్ క్లిక్ చేసి, పేమెంట్ చేయాలి. క్రెడిట్ కార్డు, యూపీఐ, డెబిట్ కార్డు ఇలా ఏ విధానంలోనైనా పేమెంట్ చేయొచ్చు. యూపీఐ వేగంగా పనిచేస్తుంది. కనుక దానిని ఉపయోగిస్తే మంచిది.