BREAKING : ఒమిక్రాన్ విజృంభణ.. కర్ణాటకలో ఒక్కరోజే 12 కేసులు

-

దక్షిణాఫ్రికా దేశంలో పురుడుపోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ 90 దేశాలకు పైగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలోనూ ఈ కొత్త ఒమిక్రాన్ వెరీయంట్ వ్యాపించింది. ఇప్పటికే 236 కేసులు మనదేశంలో నమోదయ్యాయి. ఇక తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య… 31 కి చేరింది. ఇందులో ఎక్కువ కేసులు బెంగుళూరు నగరంలోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక అటు కరోనా మహమ్మారి, ఒమీ క్రాన్ కట్టడి పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా మహమ్మారి, ఒమీ క్రాన్ కట్టడికి రాష్ట్రాలకు తాజాగా కేంద్రం సూచనలు చేసింది. కరోనా కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా, ఒమీ క్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎక్కువ కేసులు ఉన్న కొవిడ్ క్లస్టర్ లను పర్యవేక్షించాలని.. కంటోన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు అని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news