కర్ణాటకలో భూకంపం… రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు.

కర్ణాటకలో గురువారం భూకంపం సంబంధించింది. చిక్ బళ్లాపూరలో భూకంప చోటు చేసుకుంది. దీంతో ప్రజలు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగు తీశారు. కొన్ని క్షణాలపాలు భూప్రకంపను రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చిక్ బళ్లాపూర పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంప చోటు చేసుకుంది.  భూకంపాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. భూమికి 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది.

ఇటీవల కాలంలో ఇండియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల మణిపూర్, మిజోరం వంటి  ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. సగటున 4 తీవ్రతతో భూకంపాలు సంబవించడంతో కొద్దిపాటి ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకపంాలు సంభవిస్తున్నాయి. అయితే భారీ తీవ్రతతో భూకంపాలు రాకపోవడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు. దీంతో ప్రజలకు ఎలాంటి నష్టం కలుగలేదు.