ఇలా చేస్తే.. మీకు అదృష్టం వస్తుంది..!

-

ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకండి ఈ తప్పులను చేయడం వలన అదృష్టం దూరమవుతుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నా అదృష్టం కలగాలన్నా వీటిని మర్చిపోకండి ఇంటి నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యమైనది. వాస్తు ప్రకారం పాటిస్తే ఎలాంటి బాధలు అయినా కూడా పోతాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాస్తు ప్రకారం పాటించకపోయినట్లయితే అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలుగుతూ ఉంటాయి దరిద్రం కూడా పట్టుకుంటుంది.

 

సుఖసంతోషాలు ఉండవు కాబట్టి కచ్చితంగా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉండాలి. వాస్తు ప్రకారం పాటిస్తే లక్ష్మీదేవి కూడా మీ వెనక వస్తుంది వాస్తు దోషము ఉన్నట్లయితే తగిన పరిహారాలు తెలుసుకోండి. ఇంటి ముఖ ద్వారం ఎప్పుడూ కూడా అందంగా అలంకరణతో ఉండాలి ఇంటి ముఖద్వారం బాగుంటే డబ్బులు కూడా బాగా వస్తాయి. ఇంటి ముఖద్వారం సరైన దిశలో ఉండేటట్టు చూసుకోవాలి ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి గడప ముందు చెత్తాచెదారం చెప్పులు వంటివి పెట్టకూడదు.

వంటగది కూడా శుభ్రంగా ఉండాలి వంటగది శుభ్రంగా లేకపోయినా కూడా అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని తుడవాలి. ఈశాన్య దిశలో మీరు దేవుడి గదిని పెట్టి అక్కడ దేవుడిని పూజిస్తూ ఉండాలి. మొక్కలు చెట్లని సాయంత్రం పూట ముట్టుకోకూడదు. ఇలాంటి తప్పులను చేయకుండా చూసుకోవాలి అప్పుడు అదృష్టం కలిసి వస్తుంది అంతా బాగుంటుంది ఇలాంటి తప్పులను చేసినట్లయితే సమస్యలు వస్తాయి అని గుర్తు పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news