రోజుకు 8 క్యారెట్లు తింటే చర్మం నారింజ రంగులోకి వచ్చేస్తుందా..?

-

క్యారెట్లను తింటే అందం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి.. చాలామందిని క్యారెట్‌ను తినడానికి పెద్దగా ఇష్టపడరు..తిన్నా ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తినరు.. కానీ రోజుకు 8 క్యారెట్లు తినడం వల్ల మీ చర్మం రంగు కూడా నారింజ కలర్లోకి వెళ్తుందట.. ఇందులో నిజమెంత ఉంది..? నిజంగానే క్యారెట్లు తింటే చర్మం రంగు మారుతుందా..? ఇందులో నిజమెంత ఉంది.

క్యారెట్ల‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ఒక మీడియం సైజ్ క్యారెట్‌లో సుమారుగా 4 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఆరెంజ్‌-యెల్లో ఫ్యాట్ సాల్యుబుల్ స‌మ్మేళ‌నం. అంటే కొవ్వులో క‌రుగుతుంద‌న్న‌మాట‌. ఇక ఇదొక స‌హ‌జ‌సిద్ధ‌మైన పిగ్మెంట్‌. దీని వ‌ల్లే క్యారెట్లు ఆరెంజ్‌-యెల్లో క‌ల‌ర్‌లో ఉంటాయి. అయితే మ‌నం తినే క్యారెట్‌ల వ‌ల్ల ల‌భించే బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలోకి ప్రవేశించ‌గానే అది కొన్ని ఎంజైమ్‌ల స‌హాయంతో విట‌మిన్ ఏగా మారుతుంది. ఇది మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో ఒక‌టి. ఇది కంటి చూపును మెరుగుప‌రుస్తుంది. క‌ళ్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది.

క్యారెట్ల‌ను అధికంగా తింటే మ‌న శ‌రీరంలో బీటా కెరోటిన్ అధికంగా చేరుతుంది. ఈ క్ర‌మంలో శ‌రీరం త‌న‌కు అవ‌స‌రం అయినంత మేర బీటా కెరోటిన్‌ను గ్ర‌హించి దాన్ని విట‌మిన్ ఏగా మార్చుకుంటుంది. ఇక అంత‌క‌న్నా అధికంగా ఉన్న బీటాకెరోటిన్ రక్తంలో క‌లుస్తుంది. ఇది ర‌క్తంలో అధికంగా చేరితే చ‌ర్మం రంగు కూడా మారుతుంది. దీంతో మ‌న చ‌ర్మం ప‌సుపు రంగులో క‌నిపిస్తుంది. ఈ స్థితినే కెరోటినేమియా అంటారు.

క్యారెట్ల‌ను అధికంగా తింటే చ‌ర్మం ప‌సుపు లేదా నారింజ రంగులోకి మారే మాట వాస్త‌వ‌మే అయినా.. క్యారెట్ల‌ను మోతాదుకు మించి తిన‌కూడదు…తింటే దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి. వేటిని అయినా ప‌రిమిత మోతాదులో తింటేనే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అతిగా తింటే అనర్ధాలే..! కాబట్టి తక్కువగానే తినండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version