ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంతకు అంత వడ్డీ.. పూర్తి వివరాలు..

-

డబ్బులను పొదుపు చెయ్యడం చాలా మంచి పద్ధతి.. అలా ఆలోచిస్తున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతకు మించి డబుల్ వడ్డీ మీకు వస్తుంది.. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఒక పథకం అందుబాటులో ఉంది. ఇందులో చేరితే మీరు మీ డబ్బును డబుల్ చేసుకోవచ్చు. రిస్క్ లేకుండా రెట్టింపు రాబడి సొంతం చేసుకోవచ్చు..

 

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు కూడా పెంచేసింది. అందువల్ల ఇప్పుడు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే గతంలో కన్నా అధిక రాబడి పొందొచ్చని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది వరకు ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.2 శాతంగా ఉండేది. కిసాన్ వికాస్ పత్ర అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది..

ఇక విషయానికొస్తే.. కనీసం రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే మీ డబ్బులు 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. అంటే 9 ఏళ్ల 7 నెలలు ఉండాలి. ఇది వరకు డబ్బు రెట్టింపునకు 120 నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. అంటే మీరు ఈ స్కీమ్‌లో రూ. 5 లక్షలు పెడితే రూ. 10 లక్షలు పొందొచ్చు. రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది..పదేళ్లకు పైన వయసు కలిగిన వారు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే గార్డియన్ అవసరం అవుతుంది. మీరు ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత మళ్లీ డబ్బులు వెనక్కి పొందాలంటే కనీసం 2 ఏళ్ల ఆరు నెలలు వేచి ఉండాలి. తర్వాత మీరు డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు డబ్బులు రెట్టిపు అయ్యేంత వరకు ఉంటేనే ఉత్తమం. అందుకే దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు ఈ స్కీమ్‌లో చేరడం మంచిది. లేదంటే ఇతర స్కీమ్స్‌లో డబ్బులు పెట్టడం ఉత్తమం.. ఐదేళ్ల టైమ్ తో ఇలా ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version