ఏపీలో కరోనా కోరల్లో ఎంతమంది రాజకీయ నాయకులు చిక్కుకున్నారంటే.. ?

-

లోకంలో వింజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రతి వారు కలవరపడుతున్న విషయం తెలిసిందే.. ఈ కరోనా వచ్చిన సమయంలో విధించిన లాక్‌డౌన్ కాలంలో డబ్బు ఉంటే కరోనా నుండి బ్రతికి బయటపడవచ్చని ఆలోచించిన వారున్నారు.. కానీ కరోనాకు డబ్బుతో పనిలేదని అది ఉన్న వారు కూడా తన నుండి తప్పించుకోలేరని తెలియచేస్తుంది.. ఇక ఇప్పటివరకు ఈ వైరస్ బారిన ఏపీలో ఎంతమంది నాయకులు పడ్డారో తెలుసుకుంటే..

గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడి కుటుంబంలో పాజిటివ్ కేసులు నమోదవగా, ఆ ఎమ్మెల్యే కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కాగా ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక కర్నూలులో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప బంధువు కరోనా బారిన పడగా, ఇదే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో కూడా ఒకేసారి ఆరుగురికి ఈ వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీని వల్ల అప్పట్లో ఎంపీ సోదరుడితో పాటుగా, ఎంపీ కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇకపోతే అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సోదరుడు కరోనా బారిన పడ్డారు. మంత్రికి కూడా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.

 

ఇక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలోని సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ సమీప వ్యక్తులు కరోనా బారిన పడడంతో, అనిల్ కూడా క్వారంటైన్ పాటించాల్సి వచ్చింది. అంతే కాకుండా హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నివాసంలో సెక్యూరిటీ విధులు నిర్వహించేందుకు వెళ్లిన బాపట్లకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కూడా తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అదీగాక ఏపీ రాజ్ భవన్ లో ఆరుగురు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా, గవర్నర్ కూడా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది.

 

ఇక అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు మరణించిన తర్వాత కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యే సిబ్బందిలో మరో ఏడుగురుకి పాజిటివ్ అని తేల్చారు.. ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అందరిని ముచ్చటగా కరోనా పలకరిస్తున్న నేపధ్యంలో ప్రజలంతా చాల అప్రమత్తంగా ఉంటేగానీ దీని బారినుండి బయటపడలేరు.. కాబట్టి అధికారుల సూచనలు పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news