ఐస్ క్రీమ్ తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే రోజూ తింటారు..!!

-

ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరెమో.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తినడానికి ఆసక్తి చూపిస్తారు.ఒకప్పుడు ఏవో కొన్ని రకాలు వుండే ఈ ఐస్ క్రీమ్ లు ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయి.పుల్ల ఐస్‌ నుంచి నేడు క్రీమ్‌ స్టోన్‌ ఐస్‌క్రీమ్‌కు అప్‌డేట్‌ అయినా ఐస్‌క్రీమ్‌కు ఉన్న క్రేజ్‌మాత్రం అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉంది. ఐస్‌క్రీమ్‌ తింటే జలుబు చేస్తుందని తెలిసినా దీని రుచి మాత్రం తినకుండా ఆపలేదు. అంతలా ఐస్‌క్రీమ్‌ మన ఆహారంలో ఒక భాగమైపోయింది.

అమెరికాలో ప్రతీ ఏటా జూలై మూడో వారంలో తొలి ఆదివారాన్ని నేషనల్‌ ఐస్‌క్రీమ్‌ డేగా నిర్వహిస్తారనే విషయం మీకు తెలుసా.? ఎప్పటిలాగే ఈరోజు కూడా అమెరికన్‌లు ఐస్‌క్రీమ్‌ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు..ఇక ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ ను తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం..

*. ఐస్‌క్రీమ్‌లు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్‌తో నీరసించిన బాడీకి ఐస్‌క్రీమ్‌లు అప్పటికప్పుడు శక్తిని అందిస్తాయి. తక్కువ ఫ్యాట్‌ మిల్క్‌ ఉన్న ఐస్‌క్రీమ్‌ను పెద్దవారికి మేలు చేస్తాయి. కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి తక్షణం కావాల్సిన శక్తిని ఇస్తాయి.

* డైరీ ప్రొడెక్ట్స్‌లో సహజంగానే ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. పాలతో తయారయ్యే ఐస్‌క్రీమ్స్‌ ద్వారా శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి.

*. కొన్ని రకాల ఐస్‌క్రీమ్‌లను బెర్రీలు, ద్రాక్ష, పైనాపిల్‌ వంటి రకరకాల ఫ్లేవర్స్‌లలో తయారు చేస్తారు. ఇలాంటివి ఐస్‌క్రీమ్‌లను కేవలం రుచిగానే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే వాటిగా కూడా మార్చేస్తాయి. డార్క్‌ చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌లు వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

*. పాలలో ఉండే కాల్షియం, జింక్‌, పొటాషియం, ఐయోడిన్‌, పాస్పరస్‌, విటమిన్‌ ఏ, బి కాంప్లెక్స్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కెమికల్స్‌ ఎక్కువ లేని కేవలం స్వచ్ఛమైన పాలతో తయారు చేసే ఐస్‌క్రీమ్స్‌ వల్ల శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు అందుతాయని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

*. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే రసాయనం సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది. దీనిని హ్యాపీ హార్మోన్‌గా పిలుస్తారు.ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అందుకే ఫారినర్స్ ఎక్కువగా ఐస్ క్రీమ్ ను తింటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version