క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి ఆయన రికార్డుల గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ ఆటల్లోనే కాదు ఆటోమోటివ్ ఔత్సాహికుడు కూడా.. ఇకపోతే నిన్న క్రికెట్ గాడ్ సచిన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి? వంటి విషయాలతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
క్రికెటే తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి చేరిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారుగా 165 మిలియన్ డాలర్లని తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1350 కోట్లు.. బెంగళూరులో రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.. గుజరాతి కుటుంబానికి చెందిన అంజలి వివాహం చేసుకున్న సచిన్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్ లో విలాసవంతమైన ఇంట్లో జీవిస్తున్నారు.
ఇక సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం.. వీటితోపాటు బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లతో పాటు మరెన్నో కార్లు ఆయన కార్ గ్యారేజీలో ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.15 కోట్ల కంటే ఎక్కువే అని సమాచారం. అలాగే ఖరీదైన కార్లు, బంగ్లాలు కలిగి ఉన్న సచిన్ పెప్సీ, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, అడిడాస్ ,ఎయిర్టెల్, కోకోకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. వీటి ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారుగా రూ.20 కోట్ల పై మాటే. ఏది ఏమైనా స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈ రేంజ్ లో ఆస్తి కూడబెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.