బ్యాంక్ లో ఈ ఖాతా తెరిస్తే అవసరానికి రూ.10 వేలు వస్తాయి..!

-

మీరు బ్యాంక్ లో ఖాతా లేదా..? మీరు ఇప్పుడు మీకోసం ఒక ఖాతా తెరవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. పైగా ఈ ఖాతాని ఓపెన్ చెయ్యడం వలన మంచిగా లాభాల్ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

money

మీకోసం కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని అందిస్తోంది. పైగా ఈ ఖాతాని ఫ్రీగా ఓపెన్ చెయ్యచ్చు. అలానే మరిన్ని లాభాలు కూడా ఉంటాయి. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. పైగా ఎలాంటి చార్జీలు కూడా పడవు.

రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా బెనిఫిట్ ని పొందొచ్చు. అలాగే ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పైనే ఉచిత ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ఖాతా వలన ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.

అంటే ఇది కూడా రుణం మాదిరి అని చెప్పుకోవచ్చు. రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఈ లాభాన్ని మీ ఖాతా లో డబ్బులు వున్నా లేకపోయినా కూడా పొందొచ్చు. కానీ ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉండాలి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్‌పై ఈ బెనిఫిట్ ఉందో లేదో కనుక్కోండి.

Read more RELATED
Recommended to you

Latest news