హెయిర్ కట్ చేయి స్తున్నారా.. క్వరంటైన్ కి వెళ్ళండి

-

పోవే ముదలష్టపు దానా… కరోనా వైరస్ మీద చాలా మందికి పీకల వరకు కోపం ఉండి ఇలాగే తిడుతున్నారు. కరోనా వైరస్ ఎటు నుంచి వస్తుందో కూడా చెప్పడం చాలా కష్టం. దీనికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోక రూపంలో పలకరిస్తూనే ఉంది. లాక్ డౌన్ ఉన్నా సరే కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలను భయపెట్టే మరో విషయం ఏంటీ అనేది ఒక్కసారి చూద్దాం…

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెం లో ఒక బార్బర్ కి కరోనా వచ్చింది. ఎవరో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉండటంతో అతనికి హెయిర్ కట్ చేయగా బార్బర్ కి కరోనా వచ్చింది. అతనికి కరోనా బయటపడే లోపు వంద మందికి హెయిర్ కట్ చేసాడు. ఇప్పుడు వాళ్ళు అందరిని క్వారంటైన్ కి తరలించారు. గుజరాత్ లో దాదాపు వంద కేసులు ఇదే విధంగా నమోదు కావడం ఆందోళన కలిగించింది.

తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నై లో ఒక బార్బర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో దాదాపు 300 మందిని క్వారంటైన్ చేసారు. ఇలా మరి కొంత మంది ఉన్నారు. దీనితో ఇప్పుడు చాలా మంది హెయిర్ కట్ చేయించుకోవాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారో బయటకు రావాలని పోలీసులు కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news