ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల కోసం ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. చాలా మందికి ఈ బెడ్లు ఎక్కడ, ఏ ఆస్పత్రిలో ఉన్నాయో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలిసిన వారితో రికమండ్ చేయించుకుంటున్నారు. సకాలంలో బెడ్ దొరక్క చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఆక్సిజన్ బెడ్ వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ బెడ్ల వివరాలను తెలుసుకునేందుకు ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. https://covidtelangana.com అనే వెబ్‌సైట్‌పై క్లిక్ చేస్తే రాష్ట్రంలోని ఏయే హాస్పిటల్లలో ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది.
మనకు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో బెడ్‌ను దీనిద్వారా బుక్ చేసుకోవచ్చు. అందులో సదరు ఆస్పత్రి ఫోన్‌నంబర్లు కూడా ఉంటాయి. వెంటనే వారికి ఫోన్‌చేసి మన వివరాలు చెబితే ఇమీడియెట్‌గా బెడ్‌ను అరేంజ్ చేస్తారు. అంతే కాదండోయ్ ఒక్క బెడ్‌కు ఎంత ఖర్చవుతుందో కూడా అందులో వివరాలు ఉంటాయి. వీటన్నింటినీ మనం చూసుకుని నచ్చితే ఆస్పత్రిలో చేరొచ్చు.