తెలంగాణా యాసలోకి వచ్చిన షర్మిల…!

తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టే విధంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల ఇప్పుడు కాస్త సీరియస్ గానే సిఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు కూడా చేస్తున్నారు. రాజకీయంగా ఆమె కేసీఆర్ ని ఎదుర్కోవడానికి సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ లో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు అన్నారు. కరోనా తో జనం ఆగమైతున్నరు అంటూ తెలంగాణా యాస లో ట్వీట్ చేసారు.

ఆసుపత్రుల్లో డబ్బులు కట్టలేక జనం ఆస్తులు అమ్ముకుంటున్నరు అని అన్నారు. డబ్బులు కట్టనిదే శవాన్ని సైతం ఇచ్చే పరిస్థితి లేదు అని, ఆస్తులు పోగొట్టుకొని దహన సంస్కారాలకు సైతం డబ్బులు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. శవాలను సొంతూళ్ళకు సైతం తీసుకు వెళ్లలేని దుస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చండి అని కోరారు.