నాని సినిమాలు హిట్ కొట్టాలంటే.. సీక్రెట్ మంత్ర ఇదేనా..?

-

నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని కి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తనదైన శైలిలో నటిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో.. పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే నేచురల్ స్టార్ నాని నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  కానీ ఇటీవల నటిస్తున్న సినిమాలు కొంతవరకు డిజాస్టర్ ను మూటగట్టుకుంటున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

ఇకపోతే ఏ సినిమాలో అయినా సరే..హీరో హిట్ కొట్టాలి అంటే హీరో తన హీరోయిజం ని చూపించడం.. విలన్ ని చంపడం.. హీరోయిన్ తో రొమాన్స్ చేయడం చివరికి అందరూ కలిసి పోవడం లాంటివి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము . కానీ హీరో చనిపోతే మాత్రం అభిమానులు అంతగా తట్టుకోలేరు.ఇక సినిమా విజయవంతం అవుదు అని ఇండస్ట్రీ కూడా చాలా బలంగా నమ్ముతుంది. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలను చనిపోయినట్టు చూపించి భారీగా బోల్తా పడ్డ విషయం తెలిసిందే. కానీ ఒక హీరో విషయంలో మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పవచ్చు. చివర్లో హీరో చనిపోతేనే ఆ సినిమా సూపర్ హిట్ గా విజయవంతమైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరు హీరో నాని అని చెప్పవచ్చు. నాని తన సినిమాలలో హీరోగా నటిస్తూ చివరికి చనిపోయినా సరే ఆ సినిమా విజయం సాధిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆ సినిమాలు ఏమిటంటే ఈగ, జెర్సీ, భీమిలి కబడ్డీ జట్టు, జెంటిల్మెన్, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నాని సినిమా మధ్యలో చనిపోతాడు.అలా నాని సినిమా కెరియర్ లో ఏకంగా 5 సినిమాలలో తన పాత్ర చనిపోగా ఐదు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version