మహిళలు, రైతులు, పేదలకు రుణాలు మాఫీ చేయాలని చూస్తే తప్పుబడుతున్నారు : సీఎం రేవంత్

-

టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించగా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం సీఎం మాట్లాడుతూ.. మహిళలకు పీసీసీ పదవి ఇస్తే బాగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

“పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చు. సామాజిక న్యాయంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు, మహిళలు ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా ఉండొచ్చు అని అన్నారు. ఫిరాయింపులు అంతటా జరుగుతున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారు. గతంలో నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలను బీజేపీ చేర్చుకుంది. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి అని అన్నారు. ప్రధాని మోదీ గడిచిన 10 సంవత్సరాలలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేస్తే ప్రశ్నించే వారు లేరు అని మండిపడ్డారు. కానీ మహిళలు, రైతులు, పేదలకు రుణాలు మాఫీ చేయాలని చూస్తే తప్పుబడుతున్నారు” అని సీఎం రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version