ఈ ఏడాది సాధారణ వర్షాలే.. లానినో పరిస్థితులు ఎదురుకావచ్చు: ఐఎండీ

-

మరో నెలన్నర గడిస్తే వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఈ సారి వర్షాలు ఏవిధంగా ఉంటాయో ముఖ్యంగా అన్నదాతల్లో ఆందోళన ఉంది. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 2022లో నైరుతి రుతుపవన కాలంలో( జూన్ నుంచి సెప్టెంబర్) దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 96 శాతం నుంచి 104 శాతం వరకు వర్షాలు నమోదు కావచ్చని అంచనా వేసింది. అయితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2021 మాదిరిగానే ఈ సారి కూడా లానినా ప్రభావం ఎదురుకావచ్చని పేర్కొంది. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో రుతుపవణాలకు అనుకూలమైన వాతావరణం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం పసిఫిక్ భూమధ్య రేఖ ప్రాంతంలో లానినా పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. కాగా … పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని సముద్ర ఉపరిత ఉష్ణోగ్రతలు రుతుపవనాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితులను ఐఎండీ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. మరిన్ని వివరాలను మే చివరి వారంలో వెల్లడిస్తామని ఐఎండీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version