చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే చక్కెరను తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..!

-

చాలా శాతం మంది ఆరోగ్యం కోసం జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డైట్‌ లో తగిన జాగ్రత్తలను తీసుకోవడంతో పాటుగా అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. అటువంటి ఆహార పదార్థాలలో చక్కెర కూడా ఒకటి. చక్కెరను ఎక్కువ మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటుగా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా మంది బరువును నియంత్రించుకోవడానికి మాత్రమే చక్కెరను ఎక్కువగా తీసుకోరు.

అయితే చక్కెరను ఎక్కువగా తీసుకుంటే చర్మం గట్టిపడుతుంది మరియు కాంతిహీనంగా మారుతుంది. ముఖ్యంగా ముడుతలు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వలన చర్మానికి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో చక్కెరను తీసుకుంటారో గ్లైకేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీంతో చర్మ సౌందర్యానికి అవసరమైన కోలాజెన్, ఎలాస్టిన్ వంటి ప్రోటీన్లు తగ్గిపోతాయి. ఈ విధంగా చర్మం గట్టిగా మరియు పెలుసుగా మారుతుంది. ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకుంటే శరీరంలో వాపు కూడా పెరుగుతుంది.

దీంతో త్వరగా వృద్ధాప్యంకు సంబంధించిన లక్షణాలు పెరుగుతాయి. మొటిమలు, చర్మం రంగు మారడం, ఎరుపుదనం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. కనుక చక్కెరను వీలైనంతవరకు తగ్గించడం మేలు. ఈ విధంగా ఆహారంలో చక్కెర ఉండే పదార్థాలను తగ్గించడంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అంతేకాకుండా మంచి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చక్కెరకు బదులుగా సహజమైన చక్కెరలు ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. చర్మ సంరక్షణకు ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ సన్‌ స్క్రీన్‌ ను తప్పకుండా ఉపయోగించాలి. ఈ విధమైన జాగ్రత్తలను తీసుకోవడం వలన చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news