కాశీ విశిష్ట‌త‌లు తెలుసుకుంటే మైమ‌ర్చిపోవాల్సిందే…

-

కాశీ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాశీ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే  కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు.ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశిస్తాయ‌ని న‌మ్ముతారు. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం.


అంతే కాకుండా సూర్యాస్తమయం మంత్రముగ్దులను చేసే అనుభవానికి అందిస్తుంది. ప్రతి సాయంత్రం హారతి వారణాసి యొక్క ప్రధాన ఘాట్ లో నిర్వహిస్తారు. నగరం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం అనేక ఘాట్స్ ఉండటమే. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. ఇక్కడ మరణము సంభవించుట లేదా దహనం చేయుట వల్ల మోక్షం వస్తుందని భావిస్తారు.

అయితే కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉండ‌డం ఆశ్చ‌ర్యం. భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింది. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి.

ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది.  ఇక ఇక్క‌డ‌ విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం.. ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news