కావాల్సిన పదార్ధాలు:
ఖర్జూర పండు-ఒక కేజి
బెల్లం-300గ్రా
పంచదార-200గ్రా
నెయ్యి-పావు కిలో
గసగసాలు-100గ్రా
జీడిపప్పు-ఒక కేజి
సారపప్పు-150గ్రా
ఎండుకొబ్బరి-50గ్రా
యాలకుల పొడి-10గ్రా
బాదంపప్పు-200గ్రా
పిస్తాపప్పు-200గ్రా
అంజీర్ పప్పు-200గ్రా
తయారుచేసే విధానం:
ముందుగా ఖర్జూర పండులోని విత్తనాలు తీసేసి బాదంపప్పు, పిస్తాపప్పు అన్నింటినీ పొడవైన ముక్కలుగా కోసుకోవాలి. వీటన్నింటినీ విడివిడిగా ఉంచుకోవాలి. అంజీర్ పప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక కళాయి స్టవ్‌పై ఉంచి అందులో అరలీటరు నీరు పోసి, పంచదార, బెల్లం వేసి కలుపుతూ ఉండాలి. లేతగా ఉండేలా పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి కళాయిని కిందికి దింపేయాలి.
మరో బాణలి స్టవ్‌పై ఉంచి అందులో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి లైట్‌గా ఫ్రై చేయాలి. తరువాత అందులో అంజీర్‌పప్పు, గసగసాలు వేసి మరో రెండు నిమిషాలపాటు వేగించి ఆ మొత్తాన్ని ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి యాలకుల పొడి కూడా కలపాలి. కాస్త వేడిమీద ఉండగానే ఉండలుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ డ్రైఫ్రూట్ లడ్డు రెడీ..!