అద్దె, సొంత ఇల్లు.. వాస్తు విషయంలో ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు…!

-

ఇల్లు కొంటున్నాం అంటే చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వాస్తు విషయంలో ఎలా పడితే అలా ముందుకి వెళ్ళే అవకాశం ఉండదు. వాస్తు అనేది ఇంటికి చాలా ముఖ్యం. వాస్తు మూడ నమ్మకం అని ఎంత మంది చెప్పినా సరే వాస్తు విషయంలో జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఇబ్బందులు కచ్చితంగా ఉంటాయని అనుభవం ఉన్న వారు కూడా చెప్తూ ఉంటారు.

కొత్తగా అద్దెకి వెళ్తే, లేదా ఇల్లు కొంటె ఈ విషయాలు అసలు మర్చిపోవద్దు. వాస్తు శాస్త్రం అనేది ప్రతీ ఇంటికి చాలా ముఖ్యం. నీరు, వెలుతురూ, గాలి సమపాళంగా ఇంట్లోకి ప్రవేశిస్తూ, ఆ ఇంటిని ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నింపే ప్రధాన ఉద్దేశమే ఈ వాస్తు శాస్త్రం. ఒకసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, వాస్తు దోషాలు లేకుండా ఎలాగో ఒకసారి చూస్తే, ఎప్పుడైనా సరే వంటిల్లు అనేది ఆగ్నేయ మూల అంటే సౌత్-ఈస్ట్ లో ఉండాలి.

అలా లేకపోతే ఆ ఇంటికి చాలా దోషమని అంటున్నారు. ఎప్పుడు ఈశాన్యం మూల ఎలాంటి బరువు లేని చోట చూసుకోవాలి. ఏదైనా బరువు పెట్టె దిశలో కనుక ఆ ఇంట్లో ఉండొద్దు. బాత్రూం లో మల మూత్ర విసర్జన చేసేది ఎప్పుడు తూర్పు మూలంగా ఉండకూడదు. అంటే మనం తూర్పుని చూస్తూ విసర్జన అనేది చేయకూడదు. ఇది అసలు మర్చిపోవద్దు. ఎంట్రన్స్ అనేది చాలా ముఖ్యం.

దిగే మెట్లు లేదా గుంటలు, లేదా లోతుగా నీరు ఉంటే అసలు మంచిది కాదు. ఇంటి చుట్టూ పక్కన స్మశాన వాటిక లేదా కర్మాగారాలు లేదా రాముల వారి గుడి అనేది ఉండకూడదు. అలాగా ఉంటే ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయట. ఇల్లు కొన్నా సరే, లేదా అద్దెకు ఉన్నా సరే ఈ జాగ్రత్తలు మర్చిపోకుండా తీసుకోవాలి. ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయవద్దని అంటున్నారు పలువురు.

Read more RELATED
Recommended to you

Latest news