ప్రస్తుతం సమాజంలో చదువుకున్నవారు, చదువులేని వారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల బారిన పడుతున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతకంటే ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు ఇలా రకరకాల డబ్బు చెల్లింపు సేవలను అధిక శాతంమంది గూగుల్ పే ద్వారానే జరుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో గూగుల్ పే యాప్ అడ్డుపెట్టుకొని జరుగుతున్న సైబర్ దాడులు లెక్కకు మించి గా నమోదు అవుతున్నాయి..
గూగుల్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్ అంటూ ఒక మెసేజ్ వచ్చి ఆ మెసేజ్ లో ఒక లింకు ప్రత్యక్షమవుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండంటూ సైబర్ నేరగాళ్లు ఎంతో చాకచక్యంగా అడగడం, సదరు వ్యక్తి వెంటనే ఆ లింక్ పై క్లిక్ చేసి క్షణాలలో తన ఖాతాలో డబ్బులు పోగొట్టుకోవడం జరిగిపోతోంది. అలాగే స్క్రాచ్ కార్డు లను గెలుపొందారు అంటూ గూగుల్ పేని పోలిన మెసేజ్ లు చాలామందికి వస్తున్నాయి.. దాంతో
ఆతృతగా ఆ స్క్రాచ్ కార్డు గెలుపొందడానికి సైబర్ నేరగాళ్లు ఇచ్చే లింక్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఖాతాలో డబ్బు ఖాళీ అయిపోతుంది. తాజాగా ఓ పేరు మోసిన డాక్టర్ కి ఒక మేసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ kyc ని అప్డేట్ చేసుకోకపోతే మీ ఎకౌంటు బ్లాక్ అవుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి అనగానే సదరు డాక్టర్ ఆ లింక్ పై క్లిక్ చేసి వివరాలు అన్నీ ఎంటర్ చేశారు. ఇలా నమోదు చేసిన…
రెండు నిమిషాలలో ఆయన ఖాతాలో ఉన్న సుమారు 5 లక్షల సొత్తు ఖాళీ అయ్యిపోయింది. అందుకే మనకి వచ్చిన మెసేజ్ లు కానీ, ఫోన్ కాల్స్ కానీ నిజమైనవా లేఖా అనుమానితంగా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సందేహం ఏదైనా వస్తే తప్పకుండా సంభందిత బ్యాంక్ అధికారిని సంప్రదించాలి. ఆ తరువా పోలీసులకి ఈ విషయం తెలియపరచాలి. ఎవరికీ కూడా మీ ఖాతాకి సంభందించిన ఎటువంటి వివరాలు చెప్పకూడదు.