అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని… నిజాయితీగా సేవ చేస్తున్నా అని అన్నారు ఇమ్రాన్ నన్ను గద్దె దించేందుకు విదేశీ శక్తులు పని చేశాయి. లేనిపక్షంలో పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఓ విదేశీ దేశం తమకు (పాకిస్థాన్) సందేశం పంపిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. నేను రష్యా పర్యటనకు వెళ్లడం ఓ విదేశానికి ఇష్టం లేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ విపత్కర పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు.
నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లాస్ట్ బాల్ వరకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం జరిగే పరిణామాలు పాకిస్థాన్ భవిష్యత్తును నిర్థేశిస్తాయని ఆయన అన్నారు. నేను ఓటమిని అంగీకరించనని… ఇంట్లో కూర్చొను అని మరింత బలంగా మారుతా అని అన్నారు. పాకిస్తాన్ అమెరికా కోసం ఎంతో చేసిందని.. కానీ అమెరికా పాకిస్తాన్ ను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత జీహాదీ గ్రూపులు వ్యతిరేఖంగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఎవరికీ గులాం చేయాలని… ఇస్లాంలో లేదని ఆయన అన్నారు. కానీ కొందరు డబ్బు అధికారం కోసం దిగజారిపోయారని ఆరోపించారు.